News September 23, 2024
‘లేబర్ షార్టేజ్ ఇండెక్స్’ రూపొందిస్తున్న మోదీ సర్కార్

రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వృత్తుల్లో ఉద్యోగుల సప్లై, డిమాండ్ మధ్య గ్యాప్ తెలుసుకొనేందుకు కేంద్రం ఓ ఇండెక్స్ రూపొందిస్తోంది. ఇందుకోసం ILOను లేబర్ మినిస్ట్రీ సంప్రదించినట్టు తెలిసింది. ఉపాధి కల్పనకు పాలసీల తయారీ, లేబర్ మార్కెట్ ప్లానింగ్‌కు దీనిని వాడుకుంటారు. బ్లూ, వైట్‌కాలర్ వృత్తుల్లో సప్లై, డిమాండ్ గ్యాప్, జాబ్ మార్కెట్ పటిష్ఠత, ఇతర పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు కేటాయిస్తారు.
Similar News
News December 23, 2025
కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.
News December 23, 2025
పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
News December 23, 2025
‘శిఖ’ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

‘శిఖ’- ఇది పవిత్రత, క్రమశిక్షణకు చిహ్నం. వేద నియమాల ప్రకారం.. తల శుభ్రం చేసుకున్నాక శిఖను మాత్రమే ఉంచుతారు. ఇది మన శరీరంలోని ‘సహస్రార చక్రం’ ఉన్న చోట ఉంటుంది. అలాగే దైవిక శక్తిని గ్రహించడానికి సాయపడుతుంది. స్నానం, నిద్ర, అంత్యక్రియల్లో తప్ప, మిగిలిన సమయాల్లో శిఖను విరబోయడం అశుభంగా భావిస్తారు. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే దీనిని ధరించడం, ముడివేయడం జీవనశైలిలో ఓ ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.


