News November 24, 2024
ఈ నెల 27న వారి ఖాతాల్లో డబ్బులు జమ
TG: 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య రిటైర్డ్ అయిన కార్మికులకు దీపావళి బోనస్ రిలీజ్ చేస్తున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లోకి రూ.18.27కోట్లు జమ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,570 చొప్పున 2,754 మంది కార్మికులకు బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 24, 2024
మరోసారి IPL బరిలో అర్జున్ టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి IPL వేలం బరిలో నిలిచారు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్తో ఆయన అందుబాటులో ఉంటారు. టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సోదరుడు తేజస్వీ జైస్వాల్ కూడా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అమెరికా ఆటగాడు ఉన్ముక్త్ చంద్ అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో ఉన్నారు. మరి అర్జున్ టెండూల్కర్ ఈసారి ఎంత ధర పలుకుతారో కామెంట్ చేయండి.
News November 24, 2024
రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
News November 24, 2024
ఎన్టీఆర్ ‘మన దేశం’కు 75 ఏళ్లు
ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 24న ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమా కోసం కొత్త ముఖాలను ఎంపిక చేసే క్రమంలో ఒడ్డు, పొడుగు, చక్కటి వాచకం, గంభీర స్వరం ఉన్న ఎన్టీఆర్ను దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తీసుకున్నారు. ఇందులో NTR పోలీస్గా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాలు, స్టూడియోలు, రాజకీయాలతో తన జీవితమంతా బిజీబిజీగా గడిపారు.