News September 14, 2024

చంద్రుడికి మరో చంద్రుడి తోడు!

image

భూమి చుట్టూ ఎప్పుడూ ఒంటరిగానే తిరిగే చంద్రుడికి మరో చిన్న చంద్రుడు 2 నెలల పాటు సాయంగా రానున్నాడు. 10 మీటర్ల వైశాల్యం కలిగిన ‘2024 పీటీ5’ అనే గ్రహశకలం భూమి చుట్టూ పరిభ్రమించనుంది. అరుదైన ఈ ఖగోళ దృశ్యం ఈ నెల 29 నుంచి ఈ ఏడాది నవంబరు 25 వరకు ఆవిష్కృతమవుతుంది. 53 రోజుల అనంతరం అది భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని బయటికి వెళ్లిపోతుందని ఖగోళ పరిశోధకులు తెలిపారు.

Similar News

News November 30, 2025

APPLY NOW: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.

image

బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI)లో 115 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech/ BE, MSc, MCA ఉత్తీర్ణులై, 22- 45ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం రూ.64,820- రూ.1,20,940 వరకు చెల్లిస్తారు. ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofindia.bank.in/

News November 30, 2025

సినిమా UPDATES

image

* త్రివిక్రమ్-వెంకటేశ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
* రామ్ పోతినేని తన తదుపరి సినిమాను నూతన దర్శకుడు రామ్ కిశోర్‌తో చేస్తారని టాక్. 2026 జూన్‌కు షూటింగ్ కంప్లీట్ చేసి ఏడాది చివరికి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
* ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలోని స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

News November 30, 2025

విశ్వాన్ని శాసించే విష్ణుమూర్తిని ఎందుకు పూజించాలి?

image

సర్వః శర్వః శివస్థ్సాణుః భూతాదిర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||
సమస్త సృష్టికి మూలమైన, హింసను నశింపజేసే, శుభాన్ని కలిగించే దేవుడు విష్ణుమూర్తి. ఆయనే సమస్త భూతములకు ఆధారం. ఈ జగత్తును భరించే వ్యక్తి కూడా ఆయనే. అంతటి శక్తిమంతమైన దేవుడిని నిరంతరం స్మరిస్తే, మన జీవితంలో శుభం, స్థిరత్వం లభిస్తాయని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>