News August 22, 2024

చంద్రుడిపై ఒకప్పుడు ‘మాగ్మా’ సముద్రం

image

గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కీలక విషయాన్ని గుర్తించింది. చంద్రుడిపై చక్కర్లు కొట్టి ప్రజ్ఞాన్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం అక్కడ ఒకప్పుడు మాగ్మా సముద్రం ఉండేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్ని నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. ద్రవరూపంలో ఉండే మాగ్మా కారణంగానే రాళ్లు ఏర్పడతాయి. కాగా.. గత ఏడాది ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.

Similar News

News October 29, 2025

‘మొంథా’ ఎఫెక్ట్.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం

image

TG: ‘మొంథా’ తుఫాను ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. వరికోతల సమయం కావడంతో ఆరబోసిన ధాన్యానికి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, రిజర్వాయర్ల నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు నిషేధించాలని ఆదేశించారు. హైడ్రా, ఇతర రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.

News October 29, 2025

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News October 29, 2025

పాక్‌కు చెంపపెట్టులాంటి ఫొటో.. శివాంగీతో ముర్ము

image

అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్‌ రైడ్‌ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్క్వాడ్రన్ లీడర్ శివాంగీ సింగ్‌తో ఫొటో దిగారు. శివాంగీ రఫేల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ పైలట్. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రఫేల్ జెట్లు కూల్చేశామన్న పాక్.. పైలట్ శివాంగీని ప్రాణాలతో బంధించామని ప్రచారం చేసింది. కానీ ఇవాళ రాష్ట్రపతి ఆమెతో ఫొటో దిగి పాక్‌ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఈ ఫొటో దాయాదికి చెంపపెట్టులాంటిదనే చెప్పాలి.