News July 24, 2024
మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్ దుర్మరణం

పాపులర్ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్, మోస్ట్ బ్యూటిఫుల్ బైకర్గా పేరొందిన టాట్యానా ఓజోలినా (38) దుర్మరణం చెందారు. టర్కీలో ఆమె బైక్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆమె తన BMW సూపర్ బైక్పై వెళ్తుండగా నియంత్రణ కోల్పోయి మిలాస్ సమీపంలో ట్రక్కును ఢీకొన్నారు. స్థానిక టర్కిష్ బైకర్ ఒనూర్ ఒబుట్ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడగా మూడో బైకర్ క్షేమంగా ఉన్నాడు.
Similar News
News November 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 67

ఈరోజు ప్రశ్న: శ్రీమహావిష్ణువుపై లక్ష్మీదేవి ఎందుకు అలిగింది. వైకుంఠాన్ని వీడి, భూమ్మీదకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 15, 2025
మోరెల్ పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు

మోరెల్ పుట్టగొడుగుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రొటీన్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. పొటాషియం, కాపర్, విటమిన్ బి-2, యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు వీటిలో ఎక్కువ. అందుకే ఈ పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి, క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులు, గుండె జబ్బులు, మధుమేహం ముప్పు చాలా వరకు తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
News November 15, 2025
NHIDCLలో 48 ఉద్యోగాలు

నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHIDCL) 48 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 31వరకు అప్లై చేసుకోవచ్చు. Sr మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, Sr జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ టెస్ట్, రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.nhidcl.com/


