News May 1, 2024

అత్యంత ప్రమాదకరంగా ఇంగ్లండ్ జట్టు

image

టీ20 వరల్డ్ కప్‌నకు పోటీ పడే జట్లలో ఇంగ్లండ్ టీమ్ భీకరంగా కనిపిస్తోంది. తుది జట్టులో 11మందిని చూస్తే.. బట్లర్, సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, బ్రూక్, లివింగ్‌స్టన్, మొయిన్ అలీ, కరన్, ఆర్చర్, రషీద్, రీస్ టాప్లే ఉన్నారు. 10వ స్థానం వరకు బ్యాటింగ్ ఉండటం, ప్రతి ఆటగాడూ విధ్వంసకరంగా ఆడగలగడం ఈ టీమ్ ప్రత్యేకత. పేపర్‌పై బలంగా కనిపిస్తున్న ఈ ఇంగ్లండ్ జట్టు గ్రౌండ్‌లో ఎలా ఆడుతుందో చూడాలి.

Similar News

News March 4, 2026

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1,568 పాయింట్లు కుంగి 78,669 వద్ద, నిఫ్టీ 476 పాయింట్లు క్షీణించి 24,388 దగ్గర ట్రేడవుతోంది. ఇన్ఫీ, BEL, HCL టెక్ షేర్లు లాభాల్లో.. LT, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, M&M, ఇండిగో షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 92 మార్క్ దాటి ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది.

News March 4, 2026

ఘోరం.. ఇంటర్ పరీక్ష రాసి బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చింది

image

TG: నాగర్‌కర్నూల్‌లో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని(16) ఈనెల 2న పరీక్ష రాసి కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యుల సూచనతో స్కానింగ్ సెంటర్‌కు వెళ్లగా అక్కడే బాత్రూంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. KGBVలో చదువుతున్న ఈ బాలిక ఉదంతం స్థానికంగా కలకలం రేపింది.

News March 4, 2026

జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

image

ర్యాపిడో తన ఫుడ్ డెలివరీ యాప్ ‘ఓన్లీ’ (Ownly) సేవలను బెంగళూరు వ్యాప్తంగా ప్రారంభించింది. గత 7 నెలలుగా కోరమంగళ, HSR లేఅవుట్ వంటి ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా నడిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. జొమాటో, స్విగ్గీలు రెస్టారెంట్ల నుంచి 16-30% వరకు కమీషన్ వసూలు చేస్తుంటే ‘ఓన్లీ’ మాత్రం వారి నుంచి ₹400 కంటే తక్కువ ఆర్డర్లకు ₹25, ఎక్కువ వాటికి ₹50 ఫిక్స్‌డ్ ఫీజు కలెక్ట్ చేయనుంది.