News November 11, 2024

అత్యంత కాలుష్య నగరాలివే!

image

ఇండియాలో గత నెలలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను CREA విడుదల చేసింది. అందులో ఢిల్లీ రీజియన్‌కు చెందిన నగరాలే టాప్-10లో ఉండటం గమనార్హం. తొలిస్థానంలో ఢిల్లీ ఉండగా తర్వాతి స్థానాల్లో ఘజియాబాద్, ముజఫర్‌నగర్, హాపూర్, నోయిడా, మీరట్, చర్ఖీ దాదరీ, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, బహదుర్గఢ్ ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News November 15, 2025

ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

image

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.

News November 15, 2025

16 ఏళ్ల నిరీక్షణకు తెర.. నవీన్‌కు తొలి విజయం

image

TG: పదహారేళ్ల రాజకీయ జీవితంలో నవీన్ యాదవ్ తొలిసారి గెలుపు రుచి చూశారు. జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీల్లో ఎప్పుడూ ‘నవీన్.. కంటెస్టెడ్ MLA’ అని ఉండేది. ఇప్పుడు అది ‘నవీన్.. MLA’గా మారింది. 2009లో MIMతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన రెండుసార్లు కార్పొరేటర్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎట్టకేలకు ఈసారి జూబ్లీహిల్స్‌ను ‘హస్త’గతం చేసుకున్నారు.

News November 15, 2025

ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి: హైకోర్టు

image

AP: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు 6 నెలల్లోగా రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మెగా డీఎస్సీ 671వ ర్యాంకు సాధించిన రేఖ ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. తమకు పోస్టులు కేటాయించకపోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది.