News March 1, 2025
భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్ (55 కోట్లు), ఫ్రెంచ్ (30.98 CR), అరాబిక్ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.
Similar News
News March 1, 2025
ఫార్మాసిటీలో ప్రమాదం.. విషవాయువులు లీక్

AP: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఏక్టోరియా యూనిట్-6లో ప్రమాదం చోటుచేసుకుంది. విషవాయువులు పీల్చి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అతడిని వెంటనే గాజువాకలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విష వాయువులు లీకవడంతో వాటిని అదుపు చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
సంక్రాంతికి వస్తున్నాం OTTలో చిన్న ట్విస్ట్!

ఇవాళ OTTలోకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రన్ టైమ్ తగ్గింది. థియేటర్లో 2గం. 24ని.లు స్క్రీన్ అయిన ఈ సినిమా జీ5లో 2గం. 16 ని.లే అందుబాటులో ఉంది. రన్ టైమ్ కారణంగా థియేటర్ వెర్షన్లో కట్ చేసిన కొన్ని సీన్లను OTTలో యాడ్ చేస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే కొసరు మాట పక్కనబెడితే అసలుకే కత్తెరేశారు. దీనికి కారణాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
ముదిరిన వివాదం.. 22న కర్ణాటక బంద్

మహారాష్ట్రలో KSRTC సిబ్బందిపై దాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో వివాదం ముదిరింది. దాడులకు నిరసనగా ఈ నెల 22న కన్నడ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నెల 7న ఛలో బెళగావి, 11న అత్తిబెలె సరిహద్దు బంద్, 16న హోస్కెట్ టోల్ బంద్ చేస్తామని ప్రకటించాయి. త్వరలో బెంగళూరులో భారీ ర్యాలీ చేస్తామని తెలిపాయి. మరాఠీలో మాట్లాడలేదనే కారణంతో KSRTC సిబ్బందిపై పలువురు దాడి చేసిన విషయం తెలిసిందే.