News January 16, 2025
తల్లి కాదు రాక్షసి.. ఫాలోవర్లు, డబ్బు కోసం కూతురిని..

సోషల్ మీడియాలో ఫాలోవర్లు, డబ్బుల కోసం ఆస్ట్రేలియాలో ఓ మహిళ (34) దారుణానికి పాల్పడింది. ఏడాది వయసున్న కూతురికి అనవసర ఔషధాలను ఇచ్చి అనారోగ్యానికి గురయ్యేలా చేసింది. చిన్నారి పడే బాధను ఫొటోలు, వీడియోల రూపంలో టిక్టాక్లో పోస్టు చేసి విరాళంగా $37,300ను పొందింది. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్చగా అసలు విషయం బయటపడింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. చిన్నారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
Similar News
News September 18, 2025
అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు: సీఎం చంద్రబాబు

AP: కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలు గేమ్ ఛేంజర్ అని, ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తాయని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘జీఎస్టీ సంస్కరణలతో పేదల జీవితాలు మారతాయి. సంస్కరణలు అంటే నేనెప్పుడూ ముందుంటా. అభివృద్ధి జరిగితే సంపద పెరుగుతుంది. సంపద సృష్టించలేని వారికి సంక్షేమం ఇచ్చే అర్హత లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం కరెక్ట్ కాదు’ అని అన్నారు.
News September 18, 2025
GST సంస్కరణలకు మద్దతిచ్చిన తొలి రాష్ట్రం ఏపీ: పవన్

AP: GST సంస్కరణలు ప్రజలకు మేలు చేస్తాయని Dy.CM పవన్ అన్నారు. అసెంబ్లీలో GST సంస్కరణలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘GST తగ్గింపుతో అల్పాదాయ వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. జీఎస్టీ సంస్కరణల్లో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించా. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించాం. చరిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రం ఏపీ’ అని పవన్ తెలిపారు.
News September 18, 2025
మొక్కజొన్నలో బొగ్గు కుళ్లు తెగులు లక్షణాలు

మొక్కజొన్నలో పూత దశ తర్వాత నేలలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల బొగ్గు కుళ్లు తెగులు కనిపిస్తుంది. నేలలోని శిలీంధ్రం మొక్కల వేర్ల ద్వారా కాండం పైభాగానికి వ్యాపించి గోధుమ రంగు చారలు ఏర్పడతాయి. ఈ తెగులు వల్ల పంట కోత దశకు రాకముందే కాండం భాగం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి. ఇలాంటి మొక్కలను చీల్చి చూసినపుడు లోపల బెండు భాగం కుళ్లి, తెలుపు రంగు నుంచి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు.