News August 7, 2024
కలెక్షన్లలో ‘కల్కి’ సినిమా మరో రికార్డు

అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ నాలుగో స్థానానికి చేరింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద 40 రోజుల్లో రూ.640.6కోట్లు వసూలు చేసి షారుఖ్‌ఖాన్ ‘జవాన్'(రూ.640.25కోట్లు) లైఫ్ టైమ్ వసూళ్లను దాటేసింది. బాహుబలి-2 (రూ.1030.42cr), కేజీఎఫ్-2 (రూ.859.7cr), RRR (రూ.782.2cr) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News March 30, 2026
US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.
News March 30, 2026
గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.
News March 30, 2026
75 ఏళ్ల వయసులో మహిళల విడాకులు.. భర్తల వయసు ఎంతంటే?

సిమ్లా(HP)లో ఇద్దరు 75 ఏళ్ల మహిళలు భర్తలకు విడాకులు ఇచ్చారు. రెండు ఘటనల్లోనూ భార్యల కంటే భర్తల వయసు(59, 39 ఏళ్లు) తక్కువ ఉండటం గమనార్హం. అలాగే పరస్పర అంగీకారంతోనే డివోర్స్ తీసుకున్నారు. మొదటి కేసులోని జంట 1990లో పెళ్లాడగా 2010 నుంచి దూరంగా ఉంటోంది. రెండో కేసులో జంట 2008లో వివాహం చేసుకోగా 2021 నుంచి విభేదాలు మొదలయ్యాయి. సయోధ్యకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సమ్మతితో విడిపోయారు.


