News December 24, 2024
చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’ సినిమా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా రికార్డులు నెలకొల్పుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.704.25 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. దీంతో హిందీ సినిమా చరిత్రలో రూ.700+ కోట్లు(NET) సాధించిన తొలి సినిమాగా చరిత్ర లిఖించిందని మేకర్స్ ట్వీట్ చేశారు. కేవలం 19 రోజుల్లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ1700+ కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
Similar News
News December 26, 2025
తూటాకు తూటాతోనే సమాధానం చెప్పిన సర్దార్ ఉద్దమ్ సింగ్

భారత స్వాతంత్య్ర పోరాటంలో సర్దార్ ఉద్దమ్ సింగ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. జలియన్‌వాలా బాగ్ మారణకాండను ప్రత్యక్షంగా చూసి.. దానికి బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను లండన్ వెళ్లి హతమార్చారు. ‘రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్’ (మూడు మతాలు కలిసేలా) అనే పేరుతో కోర్టులో నిలబడి “దేశం కోసం యువకుడిగానే మరణిస్తా” అని ధైర్యంగా ప్రకటించారు. తూటాకు తూటాతోనే సమాధానం చెప్పిన ఉద్దమ్ సింగ్ ఎందరికో స్ఫూర్తి. నేడు ఆయన జయంతి.
News December 26, 2025
నేడు మాజీ మంత్రులతో కేసీఆర్ భేటీ

TG: ఇవాళ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ BRS ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో సమావేశమవనున్నారు. ఇందులో కేటీఆర్, హరీశ్ రావు సైతం పాల్గొననున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దానిపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది.
News December 26, 2025
అన్‌సీన్ ఫొటోలను షేర్ చేసిన సమంత

2025లోని జ్ఞాపకాలను నటి సమంత అభిమానులతో పంచుకున్నారు. ఈ ఏడాది తనకు ఎంతో స్పెషల్ అని పేర్కొంటూ పలు ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇందులో భర్త రాజ్ నిడిమోరుతో ఉన్న అన్‌సీన్ వెడ్డింగ్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో డిసెంబర్ 1న రాజ్ నిడిమోరును సమంత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే ఏడాదిలో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి.. ‘శుభం’ చిత్రంతో నిర్మాతగా మారారు.


