News December 4, 2024
‘సీజ్ ద షిప్’ పేరిట మూవీ టైటిల్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి వెంట వచ్చిన మాట ఇప్పుడు ఓ సినిమాకు టైటిల్గా మారింది. ఇటీవల కాకినాడ పోర్టులో తనిఖీల సందర్భంగా ఆయన ‘సీజ్ ద షిప్’ అనే ఆదేశాలు ఇవ్వడంతో అప్పటినుంచి ఈ వాక్యం వైరలవుతోంది. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఓ సినీ నిర్మాత రూ.1100 చెల్లించి ‘సీజ్ ద షిప్’ అనే టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నారు.
Similar News
News December 7, 2025
HNK: వెంకట్ రెడ్డిపై మరో ఏసీబీ కేసు

స్కూల్ రెన్యూవల్కు <<18480655>>రూ.60 వేలు లంచం <<>>తీసుకుంటూ ACBకి దొరికిన HNK అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. ACB అధికారుల సోదాల్లో వెంకట్ రెడ్డి ఇంటిలోని బీరువాలో రూ.30 లక్షల నగదు దొరకడం, HYDలో ల్యాండ్ పేపర్లు, నగదు దొరకడంతో ఆదాయం మించిన ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. భారీగా నగదుతో పాటుగా విదేశీ మద్యం, బంగారు ఆభరణాలు దొరికినట్టు తెలిసింది. అధికారికంగా ఎంత విలువ ఉంటుందో ACB వెల్లడించనుంది.
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 7, 2025
సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.


