News November 4, 2024
విజయ్ దేవరకొండ సినిమాలో ‘ది మమ్మీ’ నటుడు?

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హాలీవుడ్ సినిమా ‘ది మమ్మీ’తో పాపులరైన ఆర్నాల్డ్ వోస్లూ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. 1854-78 మధ్య కాలంలో జరిగే ఈ కథలో విజయ్ పాత్ర తర్వాత ఆయన క్యారెక్టర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ షూటింగ్ 2025 జనవరి నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సుంది.
Similar News
News November 12, 2025
జీరో బడ్జెట్‌తో సోలో ట్రావెలింగ్

అమ్మాయి ఒంటరిగా బయటకువెళ్తే సేఫ్‌గా వస్తుందా రాదా అనే పరిస్థితే ఇప్పటికీ ఉంది. కానీ తమిళనాడుకు చెందిన సరస్వతి నారాయణ అయ్యర్ ఒంటరిగా, జీరో బడ్జెట్‌తో దేశమంతా తిరిగేస్తూ ఫేమస్ అయ్యింది. తక్కువ లగేజ్, వెళ్లాల్సిన దారిలో లిఫ్ట్ అడగడం, కిలోమీటర్ల కొద్దీ కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఈమె బడ్జెట్ సోలో ట్రావెలింగ్ చేస్తోంది. తన అనుభవాలను వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు పెడుతూ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
News November 12, 2025
RCB ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

బెంగళూరు తొక్కిసలాట నేపథ్యంలో RCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది హోమ్ మ్యాచులను చిన్నస్వామి స్టేడియంలో ఆడొద్దని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకు బదులుగా మహారాష్ట్రలోని పుణే స్టేడియాన్ని ఎంచుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే RCB తమ మ్యాచులను హోమ్ గ్రౌండ్లో ఆడకపోవడం ఇదే తొలిసారి కానుంది. అటు సొంత టీమ్ అభిమానులకు నిరాశే మిగలనుంది.
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<


