News April 7, 2024
హత్య చేసిన వాళ్లు దర్జాగా తిరుగుతున్నారు: షర్మిల
AP: వివేకా హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. ‘ఎవరో సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే ఎంపీ అవినాశ్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నారు? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు వచ్చాయి. వివేకాను హత్య చేసిన వాళ్లు దర్జాగా బయట తిరుగుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు. నిందితుడికే టికెట్ ఇచ్చి గెలిపించాలని జగన్ చూస్తున్నారు’ అని ఆమె ఫైరయ్యారు.
Similar News
News January 8, 2025
మూడు గ్రామాలను వణికిస్తోన్న బట్టతల సమస్య
MH బుల్దానాలోని బోర్గాం, కల్వాడ్, హింగానా గ్రామాల ప్రజలను జుట్టు రాలుడు సమస్య ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే చాలా మందికి జుట్టు రాలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామాల్లోని నీటి నమూనాలను పరీక్షలకు పంపారు. దాదాపు 50 మంది ఈ సమస్యతో వైద్యులను సంప్రదించగా బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. కాగా కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.
News January 8, 2025
వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP
తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
News January 8, 2025
క్లీంకారకు నేనిచ్చే పెద్ద గిఫ్ట్ అదే: రామ్ చరణ్
మొదట కూతురు పుట్టాలనే తాను అనుకున్నట్లు హీరో రామ్ చరణ్ చెప్పారు. అదే సమయంలో ఒకటే సినిమా చేయడంతో క్లీంకారతో గడిపే సమయం దొరికిందన్నారు. షూటింగ్ ఉన్నా లేకున్నా రోజు రెండు గంటలు తనతో ఉంటానని పేర్కొన్నారు. ఒక్క ముద్ద తినేందుకు కిలోమీటర్ పరిగెడుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో బర్త్ డే వీడియో ప్లే చేయగా ఆయన ఎమోషనల్ అయ్యారు. క్లీంకారకు ప్రైవసీ ఇవ్వడమే తాను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు.