News June 22, 2024

పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు: ముద్రగడ కూతురు

image

AP: తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించని ఆయనకు పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్‌కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తోందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

Similar News

News October 17, 2025

ఫిట్‌మ్యాన్‌లా మారిన హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్‌తో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నారు. తాజా ఫొటో షూట్‌లో రోహిత్ సన్నగా కనబడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫొటో షూట్‌లో లావుగా ఉన్న రోహిత్.. వర్కౌట్స్ చేసి సన్నబడ్డారు. గతంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన హిట్‌మ్యాన్.. మళ్లీ అలాంటి ఫీట్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

News October 17, 2025

కాంగ్రెస్, MIM అన్ని హద్దులూ దాటాయి: బండి

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు MIM మద్దతివ్వడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కాంగ్రెస్, MIM సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయి. BJP, MIM ఒక్కటేనని ప్రచారం చేసే రాహుల్ గాంధీ దీనిపై ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఒవైసీ ఒడిలో కూర్చుంది. BJP ఒంటరిగా పోటీ చేస్తోంది. MIMకు పోటీ చేసే ధైర్యమే చేయలేదు. మీరేం చేసినా మేమే గెలుస్తాం. ప్రజలు ఓట్లతో జవాబిస్తారు’ అని ట్వీట్ చేశారు.

News October 17, 2025

3 రోజులు సెలవులు!

image

TG: రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. రేపు రాష్ట్రవ్యాప్తంగా బంద్ ఉండటంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలు శనివారం సెలవు ప్రకటించాయి. ఎల్లుండి ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకూ వరుసగా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. మరి లాంగ్ వీకెండ్ నేపథ్యంలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? సెలవులు ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.