News March 31, 2025
ఇరగదీసిన కొత్త కుర్రాడు

కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై కొత్త బౌలర్ అశ్వనీ కుమార్ ఇరగదీశాడు. ఎడమచేతివాటం ఫాస్ట్ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 24 పరుగులకే 4 వికెట్లు పడగొట్టాడు. IPL డెబ్యూలోనే 4 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. మొత్తంగా రహానే, రింకూ, మనీశ్, రసెల్ వికెట్లను దక్కించుకున్నాడు. బుమ్రా తరహాలో మరో మాణిక్యాన్ని MI వెలికితీసిందని, త్వరలోనే అతడు భారత్‌కు ఆడతాడని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడుతున్నారు.
Similar News
News April 2, 2025
రిజర్వేషన్ల పెంపుపై నేడు ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నా

TG: బీసీల రిజర్వేషన్లు 42% పెంపుపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్, MLAలు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలపగా పార్లమెంటులోనూ ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ, AICC నేతలు ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ పాల్గొననున్నారు.
News April 2, 2025
గాంధీ ముని మనవరాలు కన్నుమూత

మహాత్మా గాంధీ ముని మనవరాలు నీలంబెన్ పరీఖ్ (92) కన్నుమూశారు. గుజరాత్ నవ్‌సరిలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. తన తల్లికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, వయోభారంతోనే మరణించారని ఆమె కుమారుడు తెలిపారు. పరీఖ్ తన జీవితాంతం గిరిజన మహిళల విద్య కోసం కృషి చేశారు. పాఠశాలలు నిర్మించడంతో పాటు వారు వివిధ వృత్తులు చేయడానికి పాటుపడ్డారు.
News April 2, 2025
దేశానికి ఇవాళ బ్లాక్ డే: వక్ఫ్ బిల్లుపై షర్మిల

AP: మైనారిటీలను అణిచివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చిందని YS షర్మిల ఆరోపించారు. పార్లమెంట్ ముందుకు ఆ బిల్లు రావడం అంటే దేశానికి ఇవాళ బ్లాక్ డే అని తెలిపారు. వక్ఫ్ బిల్లును దేశంలోని 20కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య అని అన్నారు. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు TDP, జనసేన మద్దతు పలకడం దారుణమని మండిపడ్డారు.