News October 14, 2024
అక్రమార్జన కోసమే కొత్త లిక్కర్ పాలసీ: జగన్

AP: కొత్త లిక్కర్ పాలసీతో CM చంద్రబాబు రాష్ట్రాన్ని మరింత వెనక్కి లాగుతున్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిని వెంటనే సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రజల తరఫున ఉద్యమిస్తామన్నారు. ‘రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు. మీరు, మీ వాళ్లు డబ్బు సంపాదించుకోవడం కోసం తెచ్చిన ఈ లిక్కర్ పాలసీ ప్రమాదకరం. అక్రమార్జన కోసం ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రైవేటుకు అప్పగించారు’ అని Xలో ఆరోపించారు.
Similar News
News December 1, 2025
ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన తప్పనిసరి: మన్యం కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధి నివారణపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని కలెక్టరేట్‌లో సోమవారం మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిగ్రస్తులను చులకనగా చూడొద్దన్నారు. వ్యాధి సోకిన వారు అపోహలు మాని ఆసుపత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు.
News December 1, 2025
హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CBN

AP: విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏలూరు(D) నల్లమాడులో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన అక్కడి సభలో మాట్లాడారు. ‘94% స్ట్రైక్ రేట్‌తో గెలిపించారు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News December 1, 2025
‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.


