News January 3, 2025

భయపెడుతున్న కొత్త వైరస్.. లక్షణాలివే

image

చైనాలో విజృంభిస్తున్న HMPV.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌ మాదిరిగానే న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. ఇది సోకితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్, న్యుమోనియా, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి వాటికి దారితీసి రెస్పిరేటరీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వైరస్ తీవ్రత 3 నుంచి 6 రోజులు ఉంటుంది. అయితే దీని వ్యాప్తి మనదేశంలో ప్రస్తుతానికి లేదు.

Similar News

News November 4, 2025

ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. KMM, నల్గొండ, SRPT, MHBD, WGL, హనుమకొండ, RR, వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. HYD, NRPT, GDL, జనగామ, SDPT, భువనగిరి, మేడ్చల్, MDK జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడొచ్చని తెలిపింది.

News November 4, 2025

అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా: లోకేశ్

image

AP: అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే వైసీపీ చీఫ్ <<18199297>>జగన్<<>> మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘తుఫాను వేళ సీఎం నుంచి పంచాయతీ ఉద్యోగి వరకు ప్రజల వద్దే ఉన్నారు. తుఫాను వచ్చినప్పుడు మేమేం చేశామో తెలిసేందుకు మీరిక్కడ లేరు. నాకు మహిళలంటే గౌరవం, అందుకే ముంబై వెళ్లి WWC ఫైనల్ చూశా. తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది’ అని కౌంటర్ ఇచ్చారు.

News November 4, 2025

ప్రతి 40 రోజులకో యుద్ధ నౌక: నేవీ చీఫ్

image

ప్రతి 40 రోజులకు ఒక స్వదేశీ యుద్ధనౌక లేదా జలాంతర్గామిని ఇండియన్ నేవీలోకి చేరుస్తున్నామని చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి వెల్లడించారు. 2035 నాటికి 200కు పైగా వార్ షిప్‌లు, సబ్‌మెరైన్లు కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం 52 నౌకలు భారత షిప్‌యార్డుల్లోనే నిర్మితమవుతున్నాయని తెలిపారు. కాగా ప్రస్తుతం మన వద్ద 145 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి.