News December 31, 2024
కొత్త సంవత్సరం వచ్చేసింది..

టైమ్ జోన్ ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా కిరిబాటి దీవుల ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం DEC 31న మ.3.30 గంటలకు పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి దీవుల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం ఒక గంట వ్యవధిలోనే దక్షిణ పసిఫిక్లోని టోంగా, సమోవా దీవులు, ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలు కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తాయి.
Similar News
News October 28, 2025
భారీ వర్షాలు.. అన్నదాతలకు సూచనలు

భారీ వర్షం సమయంలో నీళ్లను బయటకు పంపాలని పొలానికి వెళ్లొద్దు. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత పరిస్థితిని బట్టి వెళ్లండి. నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటి తీరం వద్దకు వెళ్లొద్దు. నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటేందుకు ప్రయత్నించవద్దు. విద్యుత్ మోటార్లు, స్తంభాలను తాకవద్దు. వాటి దగ్గరకు వెళ్లవద్దు. పిడుగు పడే సమయంలో చెట్లకింద ఉండొద్దు. పిడుగులు పడేటప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేయండి.
News October 28, 2025
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

APPSC విడుదల చేసిన అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్(3), రాయల్టీ ఇన్స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులను అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత డిప్లొమా, BSc, B.Ed, MA, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లైకి రేపు ఆఖరు తేదీ.
News October 28, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై రూ.750 పతనమై రూ.1,12,250గా ఉంది. అటు వెండిపై రూ.5,000 తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


