News April 7, 2025
పవన్ కళ్యాణ్పై ఆ వార్తలు అవాస్తవం: పోలీసులు

AP: జేఈఈ పరీక్షలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వస్తున్న <<16020277>>వార్తలు <<>>అవాస్తవమని విశాఖ పోలీసులు తెలిపారు. ‘ప్రతి విద్యార్థీ ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలి. కానీ ఉదయం 8.41 గంటలైనా వారు పెందుర్తి జంక్షన్ దగ్గరే ఉన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఉదయం 8.30 గంటలకే బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం-పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలపలేదు’ అని వారు తెలిపారు.
Similar News
News April 8, 2025
2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.
News April 8, 2025
పవన్ కుమారుడికి గాయాలు.. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు కావడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. కాగా మన్యం పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ బయల్దేరనున్నారు. చిరంజీవి, సురేఖ దంపతులు సైతం సింగపూర్ బయల్దేరారు.
News April 8, 2025
పరామర్శకు వచ్చి జేజేలా?.. జగన్పై సునీత ఫైర్

AP: పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా మాజీ CM జగన్కు తెలియదని TDP MLA పరిటాల సునీత ఎద్దేవా చేశారు. జై జగన్ అంటూ పరామర్శకు వెళ్తారా అని ఆమె ప్రశ్నించారు. ‘పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారు. పోలీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం ఏంటి? జగన్ ఒక MLA మాత్రమే. ఒక DSP, 10 మంది పోలీసులు ఆయన పర్యటనకు సరిపోతారు. వైసీపీ నేత లింగమయ్య హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు.