News October 5, 2024
నటి నాలుగో పెళ్లి వార్తలు.. అవన్నీ సినిమా స్టంట్స్

తమిళ నటి వనిత విజయకుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను <<14242143>>వివాహం<<>> చేసుకుంటాననే అర్థంలో కొన్ని రోజుల కిందట ఫొటో షేర్ చేసింది. అయితే అదంతా సినిమా ప్రమోషన్లలో భాగమని ఇవాళ ఆమె చేసిన పోస్టుతో తేలిపోయింది. స్వీయ దర్శకత్వంలో మిసెస్&మిస్టర్ చిత్రం పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ అవుతుందని వెల్లడించారు.
Similar News
News April 14, 2026
కుర్రాళ్లు కుమ్మేశారు!

‘SRH 200కు పైగా స్కోర్ చేసినా కాపాడుకోలేదు’ ఇదీ మొన్నటివరకు ఆ జట్టుపై అభిప్రాయం. టాప్ క్లాస్ బౌలర్లు లేకపోవడం అందుకు కారణం. నిన్న అనూహ్యంగా ఆ జట్టు సీనియర్లు ఉనద్కత్, హర్షల్ పటేల్‌ను పక్కనపెట్టి ప్రఫుల్(24), హుస్సేన్(21) తీసుకొచ్చింది. గత 4 మ్యాచుల నుంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్లు అద్భుతమైన <<19643234>>ప్రదర్శనతో<<>> అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది కదా SRHకు కావాల్సిన బౌలింగ్ అని అనుకునేలా చేశారు.
News April 14, 2026
ఇరాన్‌తో మరోసారి అమెరికా చర్చలు?

కాల్పుల విరమణ గడువు ముగియక ముందే మరోసారి ఇరాన్‌తో చర్చించాలని అమెరికా భావిస్తోంది. ఎప్పుడు, ఎక్కడ భేటీ కావాలనేది ఇంకా నిర్ణయించలేదని CNN తెలిపింది. 2 దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పినట్లు పేర్కొంది. మరోవైపు యురేనియం శుద్ధిని 20 ఏళ్లు నిలిపేయాలని తొలి దశ చర్చల్లో US ప్రతిపాదించిందని Axios తెలిపింది. చర్చలు విఫలం కావడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని పేర్కొంది.
News April 14, 2026
పరమాత్ముడు ఒక్కడే.. ఈ సత్యాన్ని తెలుసుకోండి

కుండ కుంభ మండ్రు కొండ పర్వత మండ్రు
యుప్పు లవణ మండ్రు యొకటి గాదె?
భాషలింతె వేఱు పరతత్వమొకటే
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: కొన్ని పదాలకు ఒకే అర్థంలో పర్యాయపదాలుంటాయి. కుండను కుంభం, ఉప్పును లవణం, కొండను పర్వతం అంటారు. అలాగే దేశంలో కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు ఎన్ని ఉన్నా ఆ పరమాత్ముడు ఒక్కడే. ఈ సత్యాన్ని అందరూ తెలుసుకోవడం ముఖ్యం.
<<-se>>#PADHYAM<<>>


