News October 6, 2025
అనంత శక్తికి చిహ్నం ‘8’ సంఖ్య

‘8’ సంఖ్యకు అపారమైన గొప్పతనం ఉంది. సృష్టిలో 8 దిక్కులు గలవు. వాటిని మోసేది అష్ట దిగ్గజాలు. శుభాలు, సంపదలు ప్రసాదించేవారు అష్ట లక్ష్ములు. మోక్ష మార్గానికి దారి చూపేవి అష్టాంగాలు. ఈ సంఖ్య శివుని అష్ట మూర్తులను, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాలను, దశరథుని అష్ట మంత్రులను సూచిస్తుంది. జన్మహేతు, దుష్ట లక్షణాలు, ధర్మాలు కూడా ఎనిమిదే. ఈ సంఖ్య అదృష్ట సూచకమని పండితులు చెబుతున్నారు. <<-se>>#Sankhya<<>>
Similar News
News October 6, 2025
దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే

ఎ లేడీ ఆఫ్ మెనీ ఫస్ట్స్..దీనికి నిర్వచనం ముత్తులక్ష్మిరెడ్డి. బ్రిటిష్ ఇండియాలోని తొలి మహిళా ఎమ్మెల్యే. దేశంలోనే తొలి హౌస్‌సర్జన్. స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ తొలి ఛైర్‌పర్సన్. లెజిస్లేటివ్ కౌన్సిల్ తొలి డిప్యూటీ ప్రెసిడెంట్. 1886 జులై 30న ముత్తులక్ష్మి మద్రాసులోని పుదుక్కోటైలో జన్మించారు. 13 ఏళ్ల వయసులో 10th, 1912లో వైద్యవిద్యను పూర్తి చేశారు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్ వెళ్లారు.
News October 6, 2025
ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెడతారా: జగన్

AP: ఉద్యోగులకిచ్చిన హామీల అమలుపై YCP చీఫ్ జగన్ CM చంద్రబాబును ప్రశ్నించారు. ‘ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపి నడిరోడ్డుపై నిలబెడతారా? IR, PRC, OPS ఏమయ్యాయి? న్యాయంగా పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. 4 డీఏలు పెండింగ్‌లో పెట్టారు. EHS డబ్బులు ఇవ్వకపోవడంతో ఉద్యోగులకు ఆస్పత్రులు వైద్యం నిరాకరిస్తున్నాయి. రెండేళ్ల కాలంలో ఉద్యోగులకైనా, ప్రజలకైనా మీరు వెన్నుపోటే పొడిచారు’ అని ట్వీట్ చేశారు.
News October 6, 2025
రోహిత్, విరాట్ ప్రపంచకప్ ఆడాలంటే..

2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కెప్టెన్సీ మార్చిన బీసీసీఐ.. మరో రూల్ పెట్టింది. ఏ ఆటగాడైనా ఖాళీ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లేయర్స్ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించడమే దీని ఉద్దేశం. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్ కూడా ఈ రూల్ పాటించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారు 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ ఉంది.