News May 2, 2024

ఏపీ ఓటర్ల సంఖ్య 4.14 కోట్లు: సీఈవో ముకేశ్

image

AP: రాష్ట్రంలో 4.14 కోట్ల మంది ఓటర్లు(సర్వీస్ ఓటర్లు 65,707) ఉన్నారని CEO ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ‘46,165 పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఒక్కో సెంటర్‌లో 1,500 మంది ఓట్లు వేసేలా ఏర్పాట్లు చేశాం. కోడ్ ఉల్లంఘనలపై 864 FIRలు, సీజ్‌లకు సంబంధించి 9 వేల కేసులు నమోదు చేశాం. సీ విజిల్ యాప్ ద్వారా 16,345 ఫిర్యాదులొచ్చాయి. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి’ అని తెలిపారు.

Similar News

News April 12, 2026

ఇంటర్ సెకండియర్‌లోనూ మేడ్చల్ FIRST

image

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. మేడ్చల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 64,146 మంది పరీక్షలు రాయగా 53,071 మంది పాసై 82.73 శాతంతో స్టేట్‌లోనే ఫస్ట్‌ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 1,280 మందికి 922మంది పాసై 72.03%తో 23వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 6,106 మందికి 1,904 మంది పాసై 31.18%తో 21వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 95 మందికి 54 మంది పాసై 56.84%తో 10th ప్లేస్ వచ్చింది.

News April 12, 2026

అమరావతికి ₹3,165 కోట్లు ఇచ్చాం: WB

image

AP: అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ₹3,165 కోట్లు విడుదల చేసినట్లు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి వెల్లడించారు. పనుల పురోగతిని బట్టి దశలవారీగా మిగిలిన నిధులను విడుదల చేస్తామని తెలిపారు. 6ఏళ్ల గ్రేస్ పీరియడ్, 29 ఏళ్ల మెచ్యూరిటీతో లోన్ మంజూరు చేసినట్లు చెప్పారు. 2031 జూన్ 15 నుంచి రీపేమెంట్ గడువు స్టార్ట్ అవుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు కేంద్రంగా మారేలా నగరానికి సహకరిస్తామని తెలిపారు.

News April 12, 2026

ఫలితాలు విడుదల.. నిరాశ వద్దు మిత్రమా!

image

TG: ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ ఎలా వచ్చినా నిరాశపడొద్దు. మీ టాలెంట్‌ను, ఫ్యూచర్‌ను పరీక్షలే నిర్ణయిస్తాయి అనుకోవడం పెద్ద తప్పు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. సప్లిమెంటరీ రాసి పడిలేచిన కెరటంలా ముందుకెళ్లాలి. అటు పిల్లలు ఫెయిలైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులు అవమానించవద్దు. మీరే అలా చేస్తే వారికి ధైర్యం చెప్పేవారు ఎవరు?
Share It