News May 3, 2024
50 కోట్ల మార్కును దాటిన మెట్రో ప్రయాణికుల సంఖ్య
TG: హైదరాబాద్ మెట్రో 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని అధిగమించినట్లు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని, మెట్రో ట్రైన్స్ వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. రోజూ 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండో దశ మెట్రో రైలుకు డీపీఆర్‌లు సిద్ధమయ్యాయని గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.
Similar News
News December 28, 2024
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాదిరి సంపద తెలియకుండానే మాయమవుతుంది.
News December 28, 2024
జర్మనీ పార్లమెంట్ రద్దు.. FEB 23న ఎలక్షన్స్
జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇటీవల జరిగిన ఓటింగ్‌లో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయింది. 733 మంది సభ్యులున్న సభలో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 394 మంది ఓట్లు వేశారు.
News December 28, 2024
రోజా కూతురికి అంతర్జాతీయ అవార్డు
AP: మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు దక్కింది. నైజీరియాలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అన్షు 7ఏళ్లకే కోడింగ్ రాశారు. 17ఏళ్లకే ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్‌పై రీసెర్చ్ పేపర్ రాశారు. ఇది ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైంది. ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ పేరిట కవితలు, కథానికలు రాస్తుంటారు. ప్రస్తుతం ఇండియానా వర్సిటీలో చదువుతున్నారు.