News April 7, 2024
ఓటర్ల సంఖ్య పెరుగుతోంది!

AP: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈనెల 2 వరకు కొత్తగా 1,26,549 ఓటర్లు నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. మహిళా ఓటర్ల సంఖ్య 2,08,49,730 నుంచి 2,09,16,389కి పెరిగిందని, పురుష ఓటర్ల సంఖ్య 2,00,84,276 నుంచి 2,01,44,166కి పెరిగినట్లు తెలిపింది. కొత్త ఓటర్ల నమోదుకు ఇంకా అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 25, 2025
ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే.!

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే పలు ప్రయోజనాలున్నాయి. ‘రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి వాటర్ తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది అలసట, తలనొప్పి తగ్గించి శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగై మలబద్దకం ఉన్నవారికి సహాయపడుతుంది. మెటబాలిజం 20-30% పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని వైద్యులు చెబుతున్నారు.
News December 25, 2025
ఏటి ఈతకు లంక మేతకు సరి

ఒక పశువు నదిని (ఏరు) ఈదుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న లంక భూమికి వెళ్తుంది. అక్కడ కడుపు నిండా మేత మేస్తుంది. కానీ తిరిగి ఇంటికి రావాలంటే మళ్ళీ అదే నదిని ఈదుకుంటూ రావాలి. ఆ ఈతలో పడే కష్టం వల్ల మేసిన మేత అంతా అరిగిపోతుంది. అంటే, ఆ పశువుకు మేత వల్ల వచ్చిన శక్తి, నదిని ఈదడానికే ఖర్చయిపోతుంది. ఎవరైనా ఒక పనిలో ఎంత సంపాదిస్తున్నారో అదంతా ఆ పని చేయడానికే ఖర్చయిపోతే లాభంలేదని చెప్పడానికి ఈ సామెత వాడతారు.
News December 25, 2025
గురువారం నాడు ఈ పనులు చేస్తే అదృష్టం

గురువారం విష్ణుమూర్తి, బృహస్పతికి ప్రీతికరమైన రోజు. ఆర్థిక వృద్ధి, విజయం కలగాలంటే ఈరోజు నెయ్యి దీపం వెలిగించి అందులో కుంకుమ వేయాలని పండితులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలంటున్నారు. ‘పేదలకు అరటి, బొప్పాయి వంటి పసుపు పండ్లు దానం చేయాలి. విష్ణు సహస్రనామం చదవాలి. పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి, కుటుంబంతో కలిసి స్వీకరిస్తే సంతోషం కలుగుతుంది’ అంటున్నారు.


