News May 4, 2024
నర్సుకు 700ఏళ్లకుపైగా జైలు శిక్ష!

అమెరికాలో హెతర్ ప్రెస్డీ (41) అనే నర్సుకు స్థానిక కోర్టు గరిష్ఠంగా 760 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హెతర్ పేషెంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి వారి మరణానికి కారకురాలైంది. 2020-2023 మధ్య 22 మందికి హైడోస్ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో ముగ్గురి మరణాలకు సంబంధించి హెతర్ దోషిగా తేలగా మరో 19 మందిపై హత్యాయత్నం కింద కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది.
Similar News
News December 9, 2025
TODAY HEADLINES

* తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు
* వికసిత్ భారత్‌లో తెలంగాణ భాగం: జిష్ణుదేవ్
* చైనా మోడల్లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్
* జనవరిలో దావోస్ పర్యటనకు CM CBN
* 25 ఏళ్ల నాటి పాలసీల వల్లే TGకి ఆదాయం: CBN
* వందేమాతరం ఒక మంత్రం: PM
* ప్లానింగ్ లేకపోవడంతోనే ఇండిగో సంక్షోభం: రామ్మోహన్
* జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
News December 9, 2025
సంజూకు మళ్లీ నిరాశేనా!

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్
News December 9, 2025
సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్లైన్లోనే: CM

AP: ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ సంక్రాంతి నుంచి ఆన్లైన్లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గవర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేషన్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బస్టాండ్లు, టాయ్లెట్ల వద్ద పరిశుభ్రతను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.


