News March 18, 2024

టెన్త్‌ పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అధికారులు

image

నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 40,063 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్‌ సదుపాయం కల్పించారు.

Similar News

News July 5, 2024

బ్రహ్మోత్సవాలకు రండి.. మంత్రి సవితకు శ్రావణి ఆహ్వానం

image

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. పెనుకొండలో కలిసిన ఆమె గూగూడు కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. అనంతరం నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బీసీ వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరారు. ఈ మేరకు పలు అంశాలపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు.

News July 5, 2024

అనంతపురం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో దారుణ హత్య జరిగింది. నల్ల దాసరి పల్లి గ్రామంలో బోయ ఆవుల లక్ష్మన్న (48) అనే వ్యక్తి ఇవాళ తెల్లవారుజామున హత్యకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 5, 2024

అనంతపురం, సత్యసాయి జిల్లాలకు వర్ష సూచన

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి విస్తరించిన ద్రోణి కారణంగా నేడు అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ప్రజలు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.