News September 2, 2025
దేశంలో మోదీ, ఎన్టీఆర్ గురించే చర్చ!

ట్విటర్ వేదికగా ఆగస్టు నెలలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇక జులైలో మూడో స్థానంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా రెండో ర్యాంకుకు ఎగబాకారు. ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకూ X డేటా, ఇండియాలోని యూజర్ల పోస్ట్స్ నంబర్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు. వీరి తర్వాత విజయ్, పవన్, గిల్, రాహుల్ గాంధీ, కోహ్లీ, మహేశ్‌బాబు, ధోనీ, రజినీకాంత్ ఉన్నారు.
Similar News
News September 21, 2025
స్టూడెంట్స్.. టెన్షన్ వద్దు!

H1B వీసా ఫీజులను లక్ష డాలర్లకు <<17779352>>పెంచడంతో<<>> అమెరికాలో మాస్టర్స్ చేస్తున్న భారత విద్యార్థులు ఉద్యోగాలు రావని ఆందోళన చెందుతున్నారు. అయితే అమెరికాకు F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వస్తే 12 నెలల పాటు అక్కడ ఉండవచ్చు. మరో 24 నెలలు OPT ఎక్స్‌టెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే చదువు పూర్తయిన మూడేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ లోగా ట్రంప్ ప్రభుత్వం మారి H1B రూల్స్ మారొచ్చు.
News September 21, 2025
H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.
News September 21, 2025
లైంగిక వేధింపులపై యువతి ఫిర్యాదు.. KA పాల్‌పై కేసు నమోదు

TG: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను పాల్ లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు FIR నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది.