News April 10, 2025
IPLలో ఒకే ఒక్కడు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్‌లో 1,000 బౌండరీలు బాదిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో మూడు బౌండరీలు బాదడంతో ఈ ఘనత అందుకున్నారు. మొత్తంగా IPLలో 280 సిక్సర్లు, 721 ఫోర్లు బాదారు. తర్వాతి స్థానాల్లో ధవన్(920), వార్నర్(899), రోహిత్(885), గేల్(761) ఉన్నారు.
Similar News
News April 18, 2025
జాట్ మూవీ టీంపై కేసు నమోదు

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.
News April 18, 2025
BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

AP: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. హిందూపురానికి చెందిన నాగరాజు, నాగభూషణ్, మురళి, సోమలు యాద్గిర్(KA) జిల్లా షహర్‌పూర్‌కు బొలెరోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో వీరంతా అక్కడికక్కడే మృతిచెందారు.
News April 18, 2025
బంగ్లాదేశ్ నీతులు చెప్పడం మానాలి: విదేశాంగ శాఖ

భారత్‌కు నీతులు చెప్పడం మాని తమ దేశంలోని మైనారిటీలను కాపాడాలని బంగ్లాదేశ్‌కు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టంచేశారు. ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులను కప్పిపుచ్చడానికి భారత్‌ను బంగ్లాదేశ్ విమర్శిస్తోందని ఆరోపించారు. కాగా బెంగాల్‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ముగ్గురు మరణించారు. దీంతో భారత్‌లోని మైనారిటీ ముస్లింలను కాపాడాలని బంగ్లాదేశ్ వ్యాఖ్యానించింది.