News June 28, 2024

సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు.. ప్రభాస్ సరికొత్త రికార్డు

image

కల్కి 2898ADతో మరో సూపర్ హిట్ సాధించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా డార్లింగ్ నిలిచారు. బాహుబలి-2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, సలార్ రూ.178 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సాహో రూ.130 కోట్లు తొలిరోజే వసూలు చేశాయి.

Similar News

News April 7, 2026

ఇలాంటి వారితో సమాజానికి ఉపయోగం ఉండదు!

image

ముష్టి వేపచెట్టు మొదలుగా బ్రజలకు
పరగ మూలికలకు పనికివచ్చు
నిర్దయుండు ఖలుడు నీచుడెందులకగు?
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: విషపూరితంతో పాటు ఔషధ గుణాలున్న ముష్టి(Nux vomica) చెట్టు, చేదుగా ఉండే వేప చెట్టు వివిధ రూపాల్లో ఈ లోకానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ దయ లేని వాడు, దుర్మార్గుడు ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడడు. పైగా హాని చేస్తాడు.
<<-se>>#PADHYAM<<>>

News April 7, 2026

IPL: నేడు ముంబైvsరాజస్థాన్

image

IPLలో ఈరోజు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గువాహటి వేదికగా 7.30PMకి మ్యాచ్ స్టార్టవుతుంది. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇరు జట్లు 30 సార్లు తలపడగా 16 విజయాలతో MI పైచేయి సాధించింది. 2021 నుంచి 8 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసింది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశముంది. MI కెప్టెన్ హార్దిక్ ఈ మ్యాచుకు అందుబాటులో ఉంటారని సమాచారం.

News April 7, 2026

ALERT.. నేటి నుంచి వర్షాలు

image

తెలంగాణలో నేటి నుంచి 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు ఏపీలో నేడు, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA పేర్కొంది. నేడు ఉత్తర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో వానలు పడతాయని వివరించింది.