News August 13, 2024
దాడులను ఖండించిన విపక్షాలు

బంగ్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను INDIA BLOC నేతలు ఖండించారు. బంగ్లా ప్రభుత్వాధినేత మహహ్మద్ యూనస్ నాయకత్వంలో పరిస్థితి మెరుగుపడవచ్చని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అన్నారు. మైనారిటీలపై దాడులు కలిచివేస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు.
Similar News
News November 26, 2025
రాయికల్లో అత్యధికం.. జగిత్యాలలో అత్యల్పం

జగిత్యాల జిల్లాలో అత్యధికంగా గ్రామపంచాయతీలు రాయికల్ మండలంలో ఉండగా అత్యల్పంగా జగిత్యాల అర్బన్ మండలంలో ఉన్నాయి. రాయికల్ మండలంలో 32 పంచాయతీలు, 276 వార్డులు ఉన్నాయి. జగిత్యాల అర్బన్ మండలంలో 5 పంచాయతీలు, 50 వార్డులున్నాయి. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలలో రాయికల్ మండలంలో 32 మంది సర్పంచులు, 276 మంది వార్డు సభ్యులు, జగిత్యాల అర్బన్ మండలంలో ఐదుగురు సర్పంచులు, 50 మంది వార్డు సభ్యులు ఎన్నికవ్వనున్నారు.
News November 26, 2025
మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.
News November 26, 2025
ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.


