News December 6, 2024

దిగొచ్చిన పాక్ క్రికెట్ బోర్డు?

image

2025 ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో పాక్ దిగొచ్చినట్లు క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. ఐసీసీ వర్గాల నుంచి సమాచారం మేరకు.. ‘2027 వరకు భారత్, పాక్‌లో జరిగే అన్ని టోర్నీలు హైబ్రిడ్ విధానంలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ సెమీస్, ఫైనల్ చేరకపోతే ఆయా మ్యాచులు పాక్‌లోనే జరుగుతాయి. హైబ్రిడ్ విధానం వల్ల జరిగే నష్టాన్ని రికవర్ చేసేందుకు ఇరు దేశాలు, మరో దేశంతో కలిసి ట్రై-నేషన్ ఆడొచ్చు’ అని పేర్కొంది.

Similar News

News March 26, 2026

2 రోజుల్లో రూ.15.80 లక్షల కోట్ల లాభం

image

యుద్ధ మేఘాలు తొలగిపోతున్నాయన్న సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయిలో రాణించాయి. కేవలం 2 రోజుల్లోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.15.80 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం సెన్సెక్స్ 1,205 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు ఎగబాకాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు.

News March 26, 2026

గ్యాస్ సంక్షోభం.. భారత్‌ను ఆదుకుంటున్న అర్జెంటీనా

image

పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో ఏర్పడిన LPG కొరతను తీర్చడానికి అర్జెంటీనా ముందుకొచ్చింది. 2026 మొదటి 3 నెలల్లోనే దాదాపు 50,000 టన్నుల గ్యాస్‌ను భారత్‌కు పంపింది. ఇది గతేడాది మొత్తం ఎగుమతుల కంటే రెండింతలు ఎక్కువ. సుమారు 20,000 కిలోమీటర్ల సుదూర ప్రయాణం, రవాణా ఖర్చులు భారమైనప్పటికీ భారత్ ఇంధన అవసరాల కోసం అర్జెంటీనా తన సహకారాన్ని పెంచింది.

News March 26, 2026

రెడీగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.. జూన్ కల్లా మరో లక్ష: పొంగులేటి

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 1.12 లక్షల ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి పొంగులేటి ప్రకటించారు. జూన్ నాటికి మరో లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని, ఏప్రిల్‌లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు కేటాయిస్తామన్నారు. ఇళ్ల ఎంపిక కోసం గ్రామ కమిటీల్లో సర్పంచ్‌లు అధ్యక్షులుగా ఉంటారని, ఇందులో MLAల ప్రాతినిధ్యంపై ఆలోచిస్తామని తెలిపారు.