News June 17, 2024

పాక్ జట్టు అసలు జట్టే కాదు: గ్యారీ కిర్‌స్టెన్

image

T20WC గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుపై కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘జట్టులో ఐక్యత లేదు. అంతా విడిపోయారు. దీన్ని ఎవరూ జట్టు అనరు. నేను చాలా జట్లతో పని చేశాను. ఇలాంటి పరిస్థితి ఎక్కడా చూడలేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే పాలిటిక్స్‌తో నిండిన పాక్‌ను విజేతగా నిలిపేందుకు గ్యారీ కిర్‌స్టెన్ ఏమీ మాంత్రికుడు కాదని ఆ జట్టు మాజీ క్రికెటర్ కనేరియా చెప్పుకొచ్చారు.

Similar News

News April 6, 2026

PHOTO GALLERY: చెన్నైvsRCB మ్యాచ్

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన CSKvsRCB మ్యాచుకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, RCB ఓనర్ అనన్య బిర్లా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వంటి ప్రముఖులు సైతం మ్యాచును ఎంజాయ్ చేశారు. 2024 సీజన్ నుంచి చెన్నైపై RCBకి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ ఓడటానికి తానే కారణమని, బ్యాటింగ్‌లో తాను మంచి స్కోర్ చేయాల్సిందని CSK కెప్టెన్ రుతురాజ్ అన్నారు.

News April 6, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News April 6, 2026

గైక్వాడ్.. చెన్నైకి భారంగా..

image

IPL: చెన్నైకి ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భారంగా మారారు. మంచి స్టార్ట్ ఇవ్వడం పక్కనబెడితే నిర్లక్ష్యపు షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నారు. 180+ లక్ష్య ఛేదనలో అతడు 12 మ్యాచుల్లో ఒకే ఒక్కసారి హాఫ్ సెంచరీ చేశారు. 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యారు. RCBతో మ్యాచులో భారీ లక్ష్యఛేదనలోనూ 7 రన్స్ మాత్రమే చేశారు. అటు కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.