News April 25, 2024
SRH ఆటపై పాక్ దిగ్గజం విస్మయం

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటతీరుపై పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నమ్మశక్యంకాని స్థాయిలో హైదరాబాద్ ఆడుతోందన్నారు. ‘నేను ఈతరంలో క్రికెట్ ఆడనందుకు దేవుడికి థాంక్స్. 20 ఓవర్లలో 270 పరుగులా? వన్డేల్లో ఇది 500తో సమానం. పైగా పలుమార్లు ఇదే రీతిలో బాదేశారు ఆ జట్టు ఆటగాళ్లు. తొలి 5 ఓవర్లలో వంద పరుగులు అన్యాయం. ఫుల్ టాస్ బంతులేసినా ఆ స్కోరు అసాధ్యం’ అని విస్మయం వ్యక్తం చేశారు.
Similar News
News January 26, 2026
భారత్‌కు కెనడా ప్రధాని! సంబంధాలు గాడిన పడినట్లేనా?

కెనడా PM మార్క్ కార్నీ మార్చిలో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. యురేనియం, ఎనర్జీ, మినరల్స్, AI వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని భారత్‌లోని ఆ దేశ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ వెల్లడించారు. USతో కెనడాకు ఈ మధ్య చెడింది. మరోవైపు కెనడా మాజీ PM ట్రూడో అధికారంలో ఉండగా భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
News January 26, 2026
అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.
News January 26, 2026
16వేల ఉద్యోగాలు ఊస్ట్.. రేపటి నుంచే షురూ!

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. మొత్తం 30 వేల మంది తొలగింపు ప్రక్రియలో భాగంగా రేపటి నుంచి రెండో విడతలో 16,000 మందిని తొలగించనుంది. ఇప్పటికే గత అక్టోబర్‌లో 14 వేల మందిని ఇంటికి పంపగా తాజా నిర్ణయంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. 2023లోనూ 27 వేల మందిని తొలగించిన అమెజాన్, ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో మళ్లీ లేఆఫ్స్ బాట పట్టడం ఐటీ రంగంలో కలకలం రేపుతోంది.


