News October 24, 2024

నమ్ముకున్న పార్టీయే నన్ను అవమానిస్తోంది: జీవన్‌రెడ్డి

image

TG: నమ్ముకున్న పార్టీయే తనను అవమానిస్తోందంటూ AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ MLC జీవన్‌రెడ్డి లేఖ రాశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై పార్టీనే మార్గదర్శకం చేయాలన్నారు. కాంగ్రెస్ కూడా కేసీఆర్‌లా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్నారు. పార్టీలో ప్రస్తుత పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News December 25, 2025

ఆ దేశంలో 4 నెలలు క్రిస్మస్ వేడుకలు

image

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వారం నుంచి 10 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌ దేశంలో మాత్రం సుమారు 4 నెలలు విందు వినోదాలతో సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న మొదలయ్యే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనవరి మొదటి వారం (త్రీ కింగ్స్ డే) వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 16-24 వరకు ‘సింబాంగ్ గబీ’ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేసి, 24వ తేదీ అర్థరాత్రి ‘నోచే బ్యూనా’ విందుతో ఎంజాయ్ చేస్తారు.

News December 25, 2025

చెరకు పంటను నరుకుతున్నారా? ఇలా చేస్తే మేలు

image

చెరకు పంటను నరికేటప్పుడు గడలను భూమట్టానికే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమి పైన రెండు, మూడు అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతుకు నష్టం. మొదలు కణపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరకును భూమట్టానికి నరికి ఖాళీ చేసిన తోటల్లో వేళ్లు లోతుగా చొచ్చుకెళ్లి తోట బలంగా పెరిగి వర్షాకాలంలో వచ్చే ఈదురు గాలులు, వర్షాలను కూడా తట్టుకుంటుంది.

News December 25, 2025

జడ ఎలా వేస్తున్నారు?

image

జుట్టును బలంగా దువ్వి, లాగి బిగుతుగా జడ వేస్తుంటారు. ఇలాంటప్పుడు జుట్టు మరింతగా రాలే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అలానే, హడావుడిగానో, బలంగా ఒత్తిపెట్టో అదీ లేదంటే తడి తలమీద దువ్వేయడం చేసినా జుట్టు రాలిపోతుంది. కాస్త సమయం తీసుకొని వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో చిక్కులు తీసుకున్న తర్వాతే హెయిర్ స్టైలింగ్ చేసుకోండి. మరీ ఎక్కువ చిక్కు పడితే సీరమ్ రాసి దువ్వాలని సూచిస్తున్నారు.