News April 25, 2024
సికింద్రాబాద్లో గెలిచిన పార్టీదే కేంద్రంలో అధికారం: CM రేవంత్

TG: సికింద్రాబాద్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని CM రేవంత్ అన్నారు. ‘దత్తాత్రేయను అంజన్ కుమార్ ఓడించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు పునరావృతం కాబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రానుంది. దానం నాగేందర్ కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు’ అని సికింద్రాబాద్ మీటింగ్లో వ్యాఖ్యానించారు.
Similar News
News December 7, 2025
YCP ‘కోటి సంతకాలు’లో మార్పులు: సజ్జల

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేసినట్లు YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్రపతి పర్యటన వల్ల 16న గవర్నర్ షెడ్యూల్ మారింది. ఆరోజుకు బదులు 17న పార్టీ చీఫ్ జగన్, నేతలు గవర్నర్ను కలుస్తారు. ఇక జిల్లాస్థాయి ర్యాలీలు 13కు బదులు 15న జరిపి అక్కడి నుంచి బయలుదేరాలి. నియోజకవర్గాల్లో నిర్ణీత 10న కార్యక్రమాలు నిర్వహించాలి’ అని చెప్పారు.
News December 7, 2025
రెండేళ్ల పాలనలో చేసింది మోసమే: కిషన్ రెడ్డి

TG: హామీలు అమలు చేయకుండా రేవంత్ ఉత్సవాలు చేయడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ‘CM చెప్పేది ఫ్రీ బస్సు, సన్నబియ్యం గురించే. KG బియ్యంలో కేంద్రం ₹43 భరిస్తోంది. పోలీసుల్ని పెట్టుకొని గ్రామాల్లో తిరగడం కాదు. హామీలపై చర్చకు రండి’ అని సవాల్ విసిరారు. రెండేళ్ల పాలనలో అందర్నీ మోసగించారని విమర్శించారు. మహాధర్నాలో నేతలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన ఛార్జిషీట్ విడుదల చేశారు.
News December 7, 2025
ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.


