News November 16, 2024

విమానంలో బాంబు ఉందంటూ ప్రయాణికుడి కేకలు

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ కేకలు వేశాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకొని, విమానంలో తనిఖీలు చేశారు. బాంబు లేదని తేల్చారు.

Similar News

News February 2, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 47 పోస్టులు

image

బెంగళూరులోని<> CSIR<<>>-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 47 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్(BE, BTech), డిప్లొమా అర్హత గలవారు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ ట్రైనీలకు FEB 10న, డిప్లొమా ట్రైనీలకు FEB11న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా ట్రైనీలకు రూ.10,900 చెల్లిస్తారు. సైట్: https://www.nal.res.in/

News February 2, 2026

రూ.20,000 తగ్గిన సిల్వర్ రేటు

image

వెండి ధరలు మరోసారి కుప్పకూలాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఒక్కరోజే కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.3,00,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గడం గమనార్హం.

News February 2, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 332 పాయింట్ల లాభంతో 81055కు చేరగా నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 24,886 వద్ద ట్రేడవుతోంది. L&T, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.