News January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో పురుష, మహిళా ఓటర్ల శాతం ఇలా..

image

దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో 100 మంది పురుషులకు గానూ 103 మంది(100:103) మహిళలు, తెలంగాణలో 100 మంది పురుషులకు 100 మంది మహిళా ఓటర్లు(100:100) ఉన్నట్లు పేర్కొంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధికంగా ఈ నిష్పత్తి 100: 109గా ఉంది. అత్యల్పంగా గుజరాత్, హరియాణా, ఢిల్లీలో 100:84గా ఉన్నట్లు తెలిపింది.

Similar News

News February 23, 2026

మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే WW-3ని ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. పుతిన్‌ను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచాలని BBCతో అన్నారు. రష్యా డిమాండ్ చేస్తున్నట్లుగా ఉక్రెయిన్ భూభాగాలను వదులుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు భూభాగాన్ని వదులుకున్నా పుతిన్ మళ్లీ దాడికి దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు.

News February 23, 2026

ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

image

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.

News February 23, 2026

జాలి, కరుణ ఎక్కువైతే..?

image

జాలి, కరుణ ఉండటం మంచిదే! కానీ అది మితిమీరితే పతనం తప్పదని జడభరతుని కథ సూచిస్తోంది. మోక్షానికి చేరువైన భరత మహారాజు, ఓ లేడిపిల్లపై అమిత మమకారం కనబర్చి తపస్సును విస్మరించాడు. మరణప్పుడూ ఆ లేడి ధ్యాసలోనే ఉన్నాడు. దీంతో ఆయన తర్వాతి జన్మలో జింకగా పుట్టాల్సి వచ్చింది. చివరికి 3 జన్మల అనంతరం కానీ ఆయనకు మోక్షం లభించలేదు. ఏదైనా హద్దు దాటితే బంధనంగా మారుతుందని, కర్తవ్య నిష్టను దెబ్బతింటుందని ఈ కథ పరమార్థం.