News January 16, 2025
యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తి బైక్‌తో పరార్.. చివరికి ఏమైందంటే?

మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని చెప్పే కర్మ సిద్ధాంతానికి ఈ ఘటన నిదర్శనం. ఢిల్లీలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి సాయం చేయకుండా, అతని బైక్‌ను ఎత్తుకెళ్లిన ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. వికాస్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోగా ఇది చూసిన ఉదయ్, టింకు, పరంబీర్లు అతడి బైక్‌తో పరారయ్యారు. కొద్దిసేపటికే వీరికి యాక్సిడెంట్ కాగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాగా, వికాస్ చనిపోయాడు.
Similar News
News December 16, 2025
విజయ్ దివస్.. యుద్ధ వీరులకు మోదీ, రాజ్‌నాథ్ నివాళులు

1971 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో భారత్‌కు విజయాన్ని అందించిన సాయుధ దళాలను ‘విజయ్ దివస్’ సందర్భంగా PM మోదీ స్మరించుకున్నారు. ఇది దేశ చరిత్రలో గర్వించదగిన ఘట్టమని పేర్కొన్నారు. సైనికుల ధైర్యసాహసాలు, నిస్వార్థ త్యాగాలు దేశాన్ని కాపాడాయని, ఈ విజయం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని Xలో ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు అర్పిస్తూ.. ఈ విజయం త్రివిధ దళాల సమన్వయానికి ప్రతీక అని అన్నారు.
News December 16, 2025
అమెనోరియా సమస్యకు కారణమిదే!

వివిధ కారణాలతో కొందరు మహిళలకు నెలసరి సమయానికి రాదు. దీన్ని అమెనోరియా అంటారు. నెలసరి లేటుగా మొదలవడాన్ని ప్రైమరీ అమెనోరియా అని, రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోవడాన్ని సెకండరీ అమెనోరియా అని అంటారు. వంశపారంపర్యం, జన్యు కారణాలు, PCOS, ఈటింగ్ డిజార్డర్ వల్ల ఈ సమస్య వస్తుంది. ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే గర్భసంచి, గుండె సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదముంది.
News December 16, 2025
ప్రముఖ నటుడిని చంపింది కొడుకే?

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రైనర్(78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్(68)లను వారి కుమారుడు నిక్ రైనర్ <<18569745>>హత్య<<>> చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిక్ కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసై పేరెంట్స్‌తో కాకుండా గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. హత్యకు ముందు కూడా హాలిడే పార్టీలో రాబ్‌తో నిక్ గొడవపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన హాలీవుడ్లో విషాదం నింపింది.


