News May 31, 2024

ఏసీకి పూజ చేసిన వ్యక్తి.. నెట్టింట విమర్శలు

image

ఎండవేడిమికి అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనాన్నిస్తోన్న ఏసీ (ఎయిర్ కండీషనర్)లను ఆరాధించడం ఎంతో అవసరమని ఓ వ్యక్తి పూజ చేసిన ఫొటో వైరలవుతోంది. ఏసీలకు హారతిచ్చిన ఘటనను కొందరు నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. ఏసీలు అత్యధికంగా హీట్‌ను జెనరేట్ చేస్తాయని విమర్శిస్తున్నారు. చెట్లు మరింత చల్లదనాన్నిస్తాయని, ఉష్ణోగ్రతలు మరింత పెరగకముందే ప్రతి ఇంట్లో మొక్కలను పెంచుకోవడం మేలంటున్నారు.

Similar News

News October 14, 2024

బాబా సిద్దిఖీ హత్య.. అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్

image

సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. 30 ఏళ్ల బిష్ణోయ్ చండీగఢ్‌లో చదువుకునే సమయంలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమైంది. ఆ తర్వాత అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. 2012 నుంచి ఆయన ఎక్కువ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తాడు. తమకు ఇష్టమైన కృష్ణ జింకలను చంపాడనే కోపంతో సల్మాన్‌పై పగబట్టాడు.

News October 14, 2024

వెల్లుల్లి తింటే చనిపోయే వ్యాధి గురించి తెలుసా?

image

చాలామందికి వెల్లుల్లి లేకుండా వంట చేయడం కష్టమే. కానీ వెల్లుల్లి పొరపాటున తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా? దీని పేరు ‘అక్యూట్ ఇంటెర్మిటెంట్ పోర్ఫైరా’. వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడనివారికి ఈ సమస్య వస్తుంది. రోజుల తరబడి వాంతులు, మలబద్ధకం, తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు. ఇవి ఉన్నవారు వెల్లుల్లి సహా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 14, 2024

సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం

image

కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.