News September 2, 2025
విధేయుడి వైపే నిలబడ్డ గులాబీ బాస్!

TG: కవిత వర్సెస్ హరీశ్ ఎపిసోడ్‌లో గులాబీ బాస్ KCR.. హరీశ్ వైపే నిలబడ్డారు. ఆరోపణలు చేసి 24 గంటలు గడవకముందే కవితను సస్పెండ్ చేశారు. కన్న కూతురైనా పార్టీ తర్వాతే అనే స్పష్టమైన సంకేతాలు కేడర్‌కు పంపారు. పార్టీకి హరీశ్ వెన్నుపోటు పొడుస్తారని గతంలో ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. కానీ అవేమీ లెక్కచేయని ఆయన.. కేసీఆరే తన అధినేత అని కుండబద్దలు కొట్టారు. అదే విధేయత ఇప్పుడు అధినేత తనవైపు నిలబడేలా చేసింది.
Similar News
News September 3, 2025
రేపు చైనా విక్టరీ పరేడ్.. హాజరుకానున్న షరీఫ్, మునీర్

వరల్డ్ వార్-2లో గెలిచి 80 ఏళ్లవుతున్న నేపథ్యంలో చైనా రేపు విక్టరీ పరేడ్ నిర్వహించనుంది. దీనికి పాక్ PM షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ హాజరుకానుండటం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా నియంత కిమ్ సహా ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాకు చెందిన పలు దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో సైనిక శక్తిని చాటేందుకు అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, వార్ హెడ్లను చైనా ప్రదర్శించనుంది.
News September 2, 2025
ఆ ప్రచారంతో ఆరు నెలలు ఆఫర్లు రాలేదు: అనుపమ

‘రంగస్థలం’ సినిమా ఆఫర్ వదులుకున్నానని తనపై తప్పుడు ప్రచారం జరిగిందని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. రామ్ చరణ్ సినిమాను రిజెక్ట్ చేశారనే ప్రచారంతో తాను ఆఫర్లు లేకుండా 6 నెలలు ఖాళీగా ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘రంగస్థలంలో నటించాలని సుకుమార్ అడిగారు. నేను అందుకు సిద్ధమయ్యాను. అదే సమయంలో వారు వేరే హీరోయిన్‌ను నా స్థానంలో తీసుకున్నారు’ అని చెప్పారు. ఈ మూవీలో సమంత నటించిన సంగతి తెలిసిిందే.
News September 2, 2025
రాజకీయ పార్టీ నడిపిన తెలుగు వనితలు వీరే

కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు రేణుకా చౌదరి-టీడీపీ-2(1994), లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్ టీడీపీ(1996), విజయశాంతి-తల్లి తెలంగాణ(2005), కొత్తపల్లి గీత-జన జాగృతి(2018), వైఎస్ షర్మిల-వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(2021) స్థాపించారు. కానీ టీడీపీ-2, ఎన్టీఆర్ టీడీపీ తర్వాతి కాలంలో రద్దు కాగా, మిగతా పార్టీలు ఇతర పార్టీల్లో విలీనమయ్యాయి.