News March 7, 2025
‘శ్రీశైలం’ దిగువన గొయ్యి ప్రమాదకరం.. పూడ్చేయండి: NDSA

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఏర్పడిన గొయ్యి(ప్లంజ్ పూల్)ని మే నెలాఖరులోపు పూడ్చేయాలని తెలుగు రాష్ట్రాలకు NDSA సూచించింది. డ్యాం పునాది 380 అడుగులు ఉంటే ఈ గొయ్యి 410 అడుగుల వరకు ఉందని తెలిపింది. కృష్ణా నదికి ఏటా వస్తున్న వరదలతో ప్లంజ్ పూల్ ప్రాజెక్టుకు ప్రమాదకరంగా మారుతోందని తెలిపింది. సముద్ర తీరం కోతకు గురికాకుండా వినియోగించే టెట్రా పాట్స్‌తో చర్యలు చేపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.
Similar News
News March 9, 2025
గ్రాడ్యుయేట్ MLC ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

TG: KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు ఓటమికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉండి, ఉద్యోగాల భర్తీ, యువత సంక్షేమానికి కృషి చేస్తున్నా ఓడిపోవడం సరికాదు. దీని వల్ల పార్టీపై, ప్రభుత్వంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఓటమిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వండి’ అని ఆదేశించినట్లు సమాచారం.
News March 9, 2025
‘ఛాంపియన్’గా నిలిచేదెవరో?

వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు CT ఫైనల్లో ఇవాళ న్యూజిలాండ్‌తో తలపడనుంది. మ.2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం INDకు కలిసొచ్చే అంశాలు. ICC ఈవెంట్లలో భారత్‌పై కివీస్‌దే పైచేయి కావడం కలవరపెడుతోంది. కాగా ఇవాళ హిట్‌మ్యాన్ సేన విజయ పరంపరను కొనసాగించి కప్పు గెలవాలని కోరుకుందాం. మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడొచ్చు.
News March 9, 2025
న్యాయం కోసం ప్రధానిని కలుస్తాం: హత్యాచార బాధితురాలి తల్లి

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార దోషి సంజయ్ రాయ్‌కి జనవరి 20న సెషన్ కోర్టు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు వెనుక ఇంకా చాలామంది ఉన్నారంటూ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తున్న బాధితురాలి తల్లి నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో మహిళలకు భద్రతే లేకుండా పోయిందన్నారు. తమ కూతురికి న్యాయం కోసం PM మోదీని కలుస్తామని చెప్పారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.