News November 15, 2024
అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే చోటు.. పేరుమార్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని సరాయి కాలే ఖాన్ చౌక్ పేరును భగవాన్ బిర్సాముండా చౌక్‌గా మార్చింది. స్వతంత్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సాముండా 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా నగరంలోని ఇంటర్నేషనల్ బస్టాండ్ వద్ద ఆయన విగ్రహం ఆవిష్కరించింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా బిర్సాముండా గిరిజనులతో సైనిక విప్లవం సృష్టించారు. ఆయన జయంతి రోజైన NOV 15ను కేంద్రం 2021లో జన జాతీయ గౌరవ దివస్‌గా ప్రకటించింది.
Similar News
News November 10, 2025
రూ.50లక్షల కోట్లకు.. ‘మ్యూచువల్’ ఇండస్ట్రీ

దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త మైలురాయిని దాటింది. అక్టోబర్ నాటికి ఈక్విటీ అండర్ కస్టడీ ఆస్తుల విలువ ₹50లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది FEBలో విలువ ₹39.21 లక్షల కోట్లుగా ఉండగా ఏకంగా 30% వృద్ధి నమోదయ్యింది. మార్చి 2020లో నెలకు ₹8,500 కోట్లుగా ఉన్న SIPలు SEP 2025 నాటికి ₹29,361 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల రిటైల్ పెట్టుబడిదారులలో విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.
News November 10, 2025
అందెశ్రీ మృతిపై కేసీఆర్, కిషన్ రెడ్డి, సంజయ్ సంతాపం

ప్రజాకవి అందెశ్రీ మరణం పట్ల మాజీ సీఎం KCR, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో కవిగా తన పాటలు, సాహిత్యంతో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటని KCR అన్నారు. ఉద్యమ కాలంలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆకాంక్షించారు.
News November 10, 2025
పచ్చిపాలతో ముఖానికి మెరుపు

పాలతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..* 2చెంచాల పచ్చిపాలు, చెంచా తేనె కలిపి ఆ పేస్ట్‌ను కాటన్ బాల్స్‌తో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. * కొద్దిగా పచ్చిపాలు, సగం అరటి పండు వేసి మెత్తగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మెరుపులీనుతుంది.


