News August 28, 2024
రైలు పట్టాలు తప్పేలా ప్లాన్.. రైతు సంఘం నాయకుడి కుమారుడు అరెస్టు

యూపీలో ఆగస్టు 24న రైలు పట్టాలపై పెద్ద చెట్టు కొమ్మను ఉంచిన నిందితులు పోలీసులకు చిక్కారు. ఇద్దరు నిందితుల్లో ఒకరు రైతు సంఘం నాయకుడి కుమారుడు డియో సింగ్, మరొకరు మోహన్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. కాగా, యూపీ ఫరూఖాబాద్లో మద్యం మత్తులో ప్యాసింజర్ ట్రైన్ కింద 30 కేజీల చెట్టు కొమ్మను ఉంచి రైలు పట్టాలు తప్పేలా ప్లాన్ చేశారు. లోకో పైలట్లు గమనించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. నలుగురు కీలక నిందితుల అరెస్ట్

ఢిల్లీ పేలుడు కేసులో మరో నలుగురు కీలక నిందితులను NIA అరెస్ట్ చేసింది. డా.ముజమ్మిల్ షకీల్(పుల్వామా), డా.అదీల్ అహ్మద్(అనంత్నాగ్), డా.షాహీన్ సయిద్(యూపీ), ముఫ్తీ ఇర్ఫాన్(J&K)ను పటియాలా కోర్టు ఆదేశాలతో కస్టడీలోకి తీసుకుంది. ఎర్రకోట పేలుడులో వీరు కీలకంగా వ్యవహరించినట్లు NIA గుర్తించింది. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.
News November 20, 2025
త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.
News November 20, 2025
TMC-HBCHలో ఉద్యోగాలు

విశాఖపట్నంలోని <


