News August 6, 2024
కోళ్లను వేలం వేసిన పోలీసులు.. ఒక కోడి ధర రూ.4వేలు!

TG: పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ పీఎస్‌లో పోలీసులు రెండు కోళ్లను వేలం వేశారు. ఒక కోడి పుంజు రూ.4వేలు, మరో కోడి పుంజు రూ.2,500 పలికింది. కోడి పందేలు ఆడే వారి దగ్గరి నుంచి పోలీసులు ఇటీవల వీటిని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వేలం వేయగా, చుట్టు పక్కల ప్రాంతాల వారు ఆసక్తిగా పాల్గొన్నారు.
Similar News
News October 25, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

బాలీవుడ్ నటుడు సతీశ్ షా(74) మరణించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలో తుదిశ్వాస విడిచారు. కామెడీ పాత్రలతో పాపులరైన సతీశ్.. ఫనా, ఓం శాంతి ఓం, సారాభాయ్ Vs సారాభాయ్, మై హూ నా, జానే బి దో యారో మొదలైన చిత్రాల్లో నటించారు. ఇటీవలే స్టార్ కమెడియన్ గోవర్ధన్ అస్రానీ కూడా కన్నుమూసిన విషయం తెలిసిందే. వరుస మరణాలతో బాలీవుడ్లో విషాదం నెలకొంది.
News October 25, 2025
C-DACలో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

<
News October 25, 2025
ముడతలను ఇలా తగ్గించుకోండి

వయసు పెరిగే కొద్దీ చర్మం పొడిబారి ముడతలు వస్తాయి. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. వీటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. సన్‌స్ర్కీన్ లోషన్ రాసుకోవడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, విటమిన్-సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫేషియల్ ఎక్సర్సైజులు చేయడం వల్ల ఈ సమస్యను తగ్గించొచ్చని చెబుతున్నారు.


