News September 13, 2024
పోలీసుల సమావేశంలో పోలీసు శాఖ మంత్రి బ్యాగ్ చోరీ!

జరుగుతున్నది పోలీసుల సమావేశం. మాట్లాడుతున్నది హోం మంత్రి. అలాంటి చోట ఏకంగా ఆ మంత్రి హ్యాండ్బాగే చోరీకి గురైంది. UKలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి మంత్రి పర్సును రికవర్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో దొంగలు పెరిగారని సదరు మంత్రి డేమ్ డయానా విమర్శించారు. జైళ్లలో రద్దీ తగ్గించేందుకు కొంతమంది ఖైదీలను విడుదల చేయాలని సర్కారు నిర్ణయించిన రోజే ఈ చోరీ జరగడం గమనార్హం.
Similar News
News July 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹550 పెరిగి ₹98,840కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹500 పెరిగి ₹90,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 8, 2025
ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ఫ్రారంభమయ్యాయి. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 83,458 పాయింట్లు లాభపడగా, Nifty ఒక పాయింట్ నష్టంతో 25,459 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కోటక్ మహీంద్రా, NTPC, ఇండస్ ఇండ్, ICICI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో, టైటాన్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News July 8, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ UPDATES

* కాసేపట్లో శ్రీశైలానికి ఏపీ సీఎం చంద్రబాబు, మ.12 గంటలకు డ్యామ్ గేట్ల ఎత్తివేత
* TG: పాశమైలారం సిగాచీ ఘటనలో 44కు చేరిన మరణాలు
* కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మృతిపై పవన్ సంతాపం
* YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించిన షర్మిల
* వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
* విజయనగరం ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నేడు NIAకు బదిలీ
* కాసేపట్లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు KTR.. భారీగా మోహరించిన పోలీసులు