News September 26, 2025
దంచికొడుతున్న వర్షం

TG: అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, కృష్ణా నగర్, యూసఫ్‌గూడ, మాదాపూర్, మణికొండలో వర్షం దంచికొడుతోంది. ఉ.7 గంటలలోపు జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రిలోనూ వానలు పడే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మీ ఏరియాలో వర్షం కురుస్తోందా?
Similar News
News February 7, 2026
సడన్‌గా తగ్గిన రష్యా చమురు దిగుమతులు!

2025లో భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడాయిల్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా పడిపోయాయి. జూన్‌లో రోజుకు 20లక్షల బ్యారెళ్ల వద్ద టాప్ లెవల్‌కు చేరుకోగా.. నవంబర్ తర్వాత సీన్ రివర్స్ అయింది. US ఆంక్షలు, ట్రేడ్ రూల్స్ మారడంతో ఒక్కసారిగా దిగుమతులు పడిపోయాయి. ఒకప్పుడు 44% షేర్ ఉన్న రష్యా ఆయిల్ జనవరి నాటికి 22%కి పడిపోయింది. ప్రస్తుతం రోజుకు 11.6 లక్షల బ్యారెళ్లకు పరిమితమైనా ఇప్పటికీ రష్యా కీలక సప్లయర్‌గానే ఉంది.
News February 7, 2026
ఒక్క ప్రమాదం.. ముమైత్ జీవితం తలకిందులు!

ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్‌తో సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ ఇప్పుడు సినిమాల్లో కనిపించడం లేదు. ప్రస్తుతం తాను HYDలో మేకప్&హెయిర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నాకు 30 ఏళ్లున్నప్పుడు ఇంట్లో జారిపడడంతో తలకు గాయమైంది. మెదడు నరాలు దెబ్బతిన్నాయి. 15రోజులు కోమాలో ఉన్నా. ఏడేళ్లు మంచానికే పరిమితమయ్యా. ఆ సమయంలో మా అమ్మే నన్ను చూసుకుంది’ అని తెలిపారు.
News February 7, 2026
గులాబీ తోటల్లో కనిపించే చీడపీడలు

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.


