News October 6, 2025

సత్తా చాటిన శ్రియాన్షి

image

తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి Al Ain Masters వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 100 టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచి సత్తాచాటారు. ఈమె పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో మాజీ ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ తస్నిమ్‌ మీర్‌పై విజయం సాధించి టైటిల్ గెలుచుకున్నారు. దీంతో శ్రియాన్షికి 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ, 5,500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Similar News

News October 6, 2025

రొమ్ము క్యాన్సర్ కచ్చితంగా తగ్గుతుంది: డా.విశాల్

image

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమేనని హేమాటో ఆంకాలజిస్ట్ డా.విశాల్ టోకా స్పష్టం చేశారు. ‘తొలి దశలో ఆంకో ప్లాస్టీ అనే శస్త్రచికిత్సతో రొమ్మును రక్షిస్తూ క్యాన్సర్‌ను ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. రెండో దశలోనూ పూర్తిగా తగ్గించవచ్చు. 3, 4 దశల్లో ఆపరేషన్, రేడియేషన్, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సల అవసరం పడవచ్చు. కచ్చితంగా క్యాన్సర్ తగ్గుతుంది’ అని పేర్కొన్నారు.

News October 6, 2025

రొమ్ము క్యాన్సర్‌: స్వీయ పరీక్షతో అడ్డుకట్ట

image

ప్రతి మహిళా టీనేజీ నుంచే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలని హేమాటో ఆంకాలజిస్ట్ విశాల్ టోకా వెల్లడించారు. ‘రొమ్ముల్ని తాకినప్పుడు గడ్డలు తెలిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. బ్రెస్ట్ ఆకృతిలో మార్పులు కనిపించినా, చంకల్లో గడ్డ కనిపించినా నొప్పి లేదని తేలిగ్గా తీసుకోవద్దు. బ్రెస్ట్‌పై దద్దుర్లు, నిపుల్స్ ముడుచుకున్నట్లుగా లోపలివైపునకు ఉన్నా, రక్తస్రావం ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలి’ అని చెప్పారు.

News October 6, 2025

₹9వేల కోట్లతో HYDలో ఫార్మా కంపెనీ: US సంస్థతో చర్చ

image

TG: Eli Lilly(US) సంస్థ ప్రతినిధులు CM రేవంత్‌తో భేటీ అయ్యారు. HYDలో ₹9వేల కోట్లతో ఫార్మా పరిశ్రమ ఏర్పాటుపై సంస్థ ప్రెసిడెంట్ ప్యాట్రిక్
జాన్సన్ చర్చించారు. మాన్యుఫ్యాక్చర్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ నెలకొల్పుతామన్నారు. కాగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. HYDలో అనేక దిగ్గజ కంపెనీలు ఉన్నాయని, దేశంలో 40 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వివరించారు.