News April 29, 2024
కాంగ్రెస్ ఉనికి చాటుతుందా!

AP: రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ అంపశయ్య మీదకు చేరింది. 10 ఏళ్ల తర్వాత YS షర్మిల సారథ్యంలో ఈ ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. 2014 ఎన్నికల్లో పోలైన ఓట్లలో కాంగ్రెస్కు 8,02,452 ఓట్లు పడ్డాయి. ఓట్ షేర్ 2.80%గా ఉంది. 2019లో పరిస్థితి మరింత దిగజారింది. కేవలం 1.17%(3,68,810ఓట్లు) ఓటు షేర్ మాత్రమే పొందింది. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంతమేర పుంజుకుంటుందో చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 26, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు: CBN

AP: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచి, ప్రత్యేక అధికారులను నియమించాం. వర్షం తీవ్రతను, తుఫాన్ ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభావిత ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించాను’ అని ట్వీట్ చేశారు.
News October 26, 2025
నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్లో ఉద్యోగాలు

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి MBBS/BDS/BHMS/MD/MPH/MBA/ BSc నర్సింగ్, ఫిజియోథెరపితో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://devnetjobsindia.org
News October 26, 2025
ముల్తానీ మట్టితో ఎన్నో లాభాలు

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని చాలా రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి మొటిమలు, మచ్చలు తగ్గించడంలో దోహదపడుతుంది. ట్యాన్ నుంచి ఉపశమనం కలిగించడంతో పాటు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది. ఇది ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లకి మంచి ఫలితాలనిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మురికిని, అదనపు నూనెను తొలగించి మెరిసే చర్మాన్నిస్తుంది.


