News October 28, 2024

18 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన స్పెయిన్ ప్రెసిడెంట్

image

స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో సాంచెజ్ ఎర్లీమార్నింగ్ వడోదరాకు చేరుకున్నారు. 3 రోజుల పర్యటనకు వచ్చిన ఆయనకు ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ స్వాగతం పలికారు. మేకిన్ ఇండియాలో భాగంగా C295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్లాంట్‌ను PM మోదీతో కలిసి ప్రారంభిస్తారు. అలాగే కొన్ని MOUలు, అగ్రిమెంట్లపై సంతకం చేస్తారు. ట్రేడ్ వర్గాలను కలుస్తారు. స్పెయిన్ ప్రెసిడెంట్ భారత్‌కు రావడం 18 ఏళ్లలో ఇదే తొలిసారి.

Similar News

News February 7, 2026

భారత మ్యాప్‌తో పాకిస్థాన్‌కు షాకిచ్చిన అమెరికా

image

ఇండియా, అమెరికా మధ్య <<19072293>>వాణిజ్య ఒప్పందం<<>> కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో US వాణిజ్య ప్రతినిధి ఆఫీసు రిలీజ్ చేసిన భారత మ్యాప్ ఆసక్తికరంగా మారింది. అందులో జమ్మూకశ్మీర్ మొత్తం ఇండియాలో భాగమే అన్నట్లుగా, ఎలాంటి విభజన రేఖ లేకుండా ఉండటం గమనార్హం. POK కూడా భారత్‌దేనని పరోక్షంగా అంగీకరించి పాక్‌కు షాకిచ్చింది. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాలో అంతర్భాగమనే కేంద్రం వాదనకు బలాన్నిచ్చింది.

News February 7, 2026

అమెరికాతో ట్రేడ్ డీల్.. వీటి ధరలు తగ్గుతాయి..!

image

ట్రేడ్ డీల్ నేపథ్యంలో అమెరికా నుంచి ఎగుమతయ్యే పలు వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. కొన్నింటిపై జీరో టారిఫ్స్ అమల్లోకి రానున్నాయి. దీంతో అమెరికా ఇండస్ట్రియల్ గూడ్స్, డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్, ఎర్ర జొన్నలు(పశువుల దాణా), ట్రీ నట్స్(బాదం, పిస్తా Etc), తాజా, ప్రాసెస్డ్ ఫ్రూట్స్, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్(విస్కీ, వోడ్కా, రమ్ తదితరాలు) వంటి ఎన్నో ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి.

News February 7, 2026

805 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

C-DAC 805 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, పీజీ(సైన్స్, MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు FEB 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.